మర్డర్ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

by Disha Web Desk 15 |
మర్డర్ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మర్డర్ కేసులో ఇద్దరికి జీవిత ఖైదు, రూ. 2వేల జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి టి. రఘురాం తీర్పు వెల్లడించారు. త్రీ టౌన్ సీఐ భాను ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం...ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన శీల నాగరాజు(25) తన పెండ్లి ప్రతికలు బంధువులకు పంచడానికి వెళ్లి తిరిగి రాలేదు. నాగరాజు తండ్రి శీల భూమయ్య బంధువులను ఆరాతీయగా ఎవ్వరు రాలేదని తెలిపారు. అనుమానంతో వెతుకుతున్న క్రమంలో వ్యవసాయ బావి సమీపంలో నాగరాజుకు సంబంధించిన వస్తువులు కనబడటంతో బావిలో పడి ఉంటాడనే అనుమానంతో గత ఈతగాళ్లతో వెతికించి శవాన్ని బయటకు తీశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి కాళ్లు చేతులు కట్టివేసి బావిలో పడేశారని శీల భూమయ్య ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా అనుమానంతో శీల ఎల్లయ్య, శీల పర్శురాములను అప్పటి రూరల్ సీఐ సైదులు, ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి విచారించారు. ఈమేరకు శీల ఎల్లయ్య కూతురుకు పెండ్లి అయిన తరువాత భర్తను విడిచిపెట్టి వేరే వ్యక్తి ని తీసుకొని వెళ్లి పోవడానికి నాగరాజు సహకరించడన్న కారణంతో చంపి కాళ్లు చేతులు కట్టి వేసి బావిలో పడి వేసినట్లు నేరస్తులు నేరం అంగీకరించారు.

ఇద్దరినీ రిమాండ్ కు తరలించి తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుండి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఇద్దరి వాదనలు విన్న తర్వత నేరుస్తులపై నేరం రుజువైనందున శీల ఎల్లయ్య, శీల పర్శురాములకు యావజ్జీవ కారాగార శిక్ష, 2వేల జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్ టి. రఘురాం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ లింగం వాదనలు వినిపించారు. కేసు ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ సమయంలో సపోర్ట్ చేసిన ఎస్సై శ్రీనివాస్ రెడ్డి (ప్రస్తుతం సంగారెడ్డి రూరల్ ఎస్ఐ), సీఐ సైదులు ప్రస్తుతం (మెదక్ డీఎస్పీ), పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ లింగం, కోర్టు కానిస్టేబుళ్లు రవి, శ్రీనివాస్, కోర్టు లైజనింగ్ ఏఎస్ఐ స్వామిదాస్, హెడ్ కానిస్టేబుల్ రాజమల్లు లను సీపీ శ్వేత అభినందించారు.


Next Story

Most Viewed