ఓకే ఊరుకు .. మూడు పేర్లా?

by Dishanational2 |
ఓకే ఊరుకు .. మూడు పేర్లా?
X

దిశ రాయికో డ్ : సహజంగా ఏ ఊరుకైనా ఒక పేరు లేదా రెండుపేర్లు ఉండడం చూశాం .. కానీ ఓ ఊరుకు ఏకంగా మూడు పేర్లు ఉండడం ఎప్పుడైనా చూశారా..అది నిజమేనండి. అదే సంగారెడ్డి జిల్లా రాయికోడ్​ మండల ముస్తాఫపూర్, మండల పరిధిలోని చర్ల నాగన్ పల్లి గ్రామ పంచాయతీ శివారు గ్రామమైనా ముస్తఫాపూర్ కు ముచ్చటగా మూడు పేర్లు ఉండడం గమనార్హం.

కాగా, రెవిన్యూ రికార్డులో ఒకపేరు, వైద్య, విద్యాశాఖలలో మరో పేరు రిహబిటేషన్ లో మరో విధంగా పిలిచేవారు. సింగూర్ ప్రాజెక్టులో ముంపునకు గురికాక ముందు ఈ ఊరికి అసలు పేరు ముస్తాఫపూర్ అయితే ఊరులో గల ప్రాథమిక పాఠశాల భవనంపైనే కాకుండా విద్యాశాఖ రికార్డుల్లో, వైద్యారోగ్య శాఖలో బొగ్గులంపల్లిగా ఉంది. రెవెన్యూ రికార్దుల్లో , ఆధార్ కార్డు, ఓటరు లిస్టు జాబితాల్లో మాత్రం ముస్తాఫపూర్​గా ఉంది. ఇదిలా ఉంటే సింగూరు ప్రాజెక్టులో ఈ గ్రామం ముంపునకు గురికావడంతో అప్పట్లో అప్పటి ప్రభుత్వం అందించిన పునరావాసం రికార్డుల్లో, పునర్ నిర్మాణంలో అప్పటి ప్రజాప్రతినిధులు భాగ్యనగర్​గా నామకారణ చేసి ఇండ్లు కట్టించారు.

ఒకే ఊరుకు ముచ్చటగా మూడు పేర్లు కలిగి ఉండడంతో ఊరుకు వచ్చే బంధువులు, కొత్త వ్యక్తులు ఆశ్చ్యర్యానికి గురవుతూ, ఇదేంది ఈ ఊరుకు మూడు పేర్లు ఉన్నయ్​ అంటూ అవాక్కవుతున్నారు. దీంతో మూడు పేర్లలలో ఏ పేరు చెప్పాలో ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. ముస్తఫా పూర్‌గా ప్రజల్లో వాడకం ఎక్కువగా లేకపోవడం వల్ల ఆ ఊరు అడ్రస్ అడిగిన ఎవ్వరు సమాచారం చెప్పకపోవడంతో కొంతమందికి వెనుదిరిగిపోతున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ ఊరుకు ఓకే పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story

Most Viewed