- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
బీజేపీ జిల్లా అధ్యక్ష రేసులో ఆ ముగ్గురు..?

దిశ, సిద్దిపేట ప్రతినిధి: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరు కానున్నారనే విషయం లో ఉత్కంఠ నెలకొంది. పాత, కొత్త నాయకులు పదవి కోసం పట్టుబడుతున్నారు. నెలాఖరులోపే జిల్లా అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉండడంతో ఆశావాదులు అధిష్టానం ఆశీస్సుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా పరిధిలో బీజేపీ కి ఆశించిన మేర ఫలితం దక్కన్నప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానం కైవసం చేసుకొని సత్తా చాటుకుంది. పల్లె పోరుకు రాష్ట్ర ప్రభుత్వం పావుల కదుపుతున్న నేపథ్యంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలకు చేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా, మండల, గ్రామ కమిటీల నియామకం పై దృష్టి సారించింది.
జిల్లా పరిధిలో గ్రామ, మండల కమిటీల నియామకం దాదాపు పూర్తయింది. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిని మాజీ జిల్లా అధ్యక్షుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సిద్దిపేట నియోజకవర్గం అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి, దుబ్బాక నియోజక వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే విధంగా మరో అవకాశం ఇవ్వాలని ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి సైతం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఎంపీ వద్ద కు చేరిన జిల్లా అధ్యక్ష పంచాయతీ..?
బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి పంచాయితీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు వద్దకు చేరిందని సమాచారం. ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై గుర్రు మీద ఉన్న కొందరు బీజేపీ నాయకులు ఆయనకు మరో అవకాశం ఇవ్వవద్దని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నాయకులు సైతం ఎంపీ రఘునందన్ రావు వద్దకు వెళ్లి జిల్లా అధ్యక్ష పదవి తనకే ఇప్పించాలని కోరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది.
బీసీ కా.. ఓసీ కా..?
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలు, నేపథ్యం కీలకం కావడంతో ఈసారి జిల్లా అధ్యక్ష పదవి బీసీ కి దక్కుతుందా.. లేదా ఓసీకి దక్కుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా ఏర్పాటైన నాటి నుంచి బీసీ సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి దక్కలేదని ఈసారి బీసీకే అవకాశం కల్పించాలని ఆ వర్గం నాయకులు పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పార్టీ కోసం విద్యార్థి స్థాయి నుంచి పని చేస్తున్నానని అవకాశం ఇవ్వాలని ఓసీ నాయకులు కోరుతున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకుల మాటలు అటుంచితే... అధిష్టానం మదిలో ఏముంది.. పదవి ఎవరికి దక్కుతుంది అనే విషయం తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.