ముస్తాబైన మల్లికార్జునుడి ఆలయం..

by Sumithra |
ముస్తాబైన మల్లికార్జునుడి ఆలయం..
X

దిశ. వర్గల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబిక, కేతమ్మ సమేత మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు భక్తులు వేలాదిగా తరలి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల తీరు ఇలా... 9న ఉదయం గోపూజ, గురవందనం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, అఖండ దీపారాధన, కలశస్థాపన, సాయంత్రం ఆవాహిత దేవతా పూజలు, అగ్ని ప్రతిష్ఠాపన, గణపతి, శ్రీరుద్ర సహిత ఆవాహిత దేవతా హోమాలు, రాత్రి ధ్వజస్థాపన కార్యక్రమాలుంటాయి. 10వ తేదీ ఉదయం గణపతి పూజ, ప్రాతఃకాల పూజలు, విగ్రహ ప్రతిష్ట, బలిహరణం, మహా పూర్ణాహుతి, పండిత సత్కారాలు మధ్యాహ్నం అగ్ని గుండాల ప్రవేశం, సాయంత్రం శ్రీ మల్లన్న స్వామికి బండ్లు తిప్పే కార్యక్రమం, బోనాలు ఉంటాయి. 11వ తేదీన మధ్యాహ్నం ఒగ్గు కథ, సల్లలు చేయుట, కొండపోచమ్మకు బోనాలు సమర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ నిర్వాహకుడు పెద్దగొల్ల యాదయ్య తెలిపారు.

Next Story

Most Viewed