గులాబి రంగు చొక్కా ధరించి వచ్చిన ఎమ్మెల్యే

by Disha Web Desk 22 |
గులాబి రంగు చొక్కా ధరించి వచ్చిన ఎమ్మెల్యే
X

దిశ, బెజ్జంకి: ఎమ్మెల్యే గులాభి రంగు చొక్కా ధరించి వచ్చి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాడని మండల కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఎన్నికల సరళిని పరిశీలించడానికి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని గురువారం సందర్శించేందుకు రావడంతో గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రసమయి బాలకిషన్ తన పార్టీ రంగు చొక్కా ధరించి వచ్చి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకోనగా పోలీసులు ఇరువర్గాలను చెదరగోట్టారు. ఉద్రిక్తత వాతావరణం మద్య ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ యదావిధిగా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి సంరక్షకుల మద్య వేళ్లిపోవడం విశేషం.Next Story

Most Viewed