అధికారంలోకి మళ్లీ రావాలని ఆకాంక్షతోనే దశాబ్ది ఉత్సవాలా.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

by Disha Web Desk 20 |
అధికారంలోకి మళ్లీ రావాలని ఆకాంక్షతోనే దశాబ్ది ఉత్సవాలా.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
X

దిశ, చిన్నశంకరంపేట : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలు ఎవరికోసం అధికార పార్టీ ప్రచారం కోసమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ గురువారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఎవరికోసం, ఎందుకోసం, కర్ణాటకలో జరిగిన ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తొమ్మిది సంవత్సరాలకే శతాబ్ది ఉత్సవాలు ప్రభుత్వం ప్రచారం కోసమే నిర్వహిస్తుందన్నారు. రైతులను కన్నీరు పెట్టించిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దగ్గర పడితే కాపలా కుక్కలా ఉంటానని తనకు పదవులు వద్దని అన్నారు.

పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పి, కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నాలు చేస్తుంటే సీఎం మానంగా ఉండిపోయి, ధర్నాలు చేస్తుంటే వారిని బెదిరించి విధుల్లోకి చేదుమని లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించారని తెలిపారు. ఇందుకోసం ఈమధ్య కాలంలో బీసీ బందు కూడా ఇస్తానని బీసీల ఓట్లు ఆకర్షించడం కోసమే బీసీ బందు పథకం పెడతానని బీసీ ఓట్లు రాబట్టుకోవడానికి కోసమే బీసీ బందు అంటున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశాడో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ దండనీతిని ప్రజలకు చెప్తామని తెలిపారు.



Next Story

Most Viewed