మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ అతిథి గృహం

by Disha WebDesk |
మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ అతిథి గృహం
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ అతిథి గృహం (ఐబీ) మందుబాబులకు అడ్డాగా మారింది. ప్రభుత్వ అతిథులు, అధికారులకు వసతి కోసం ఏర్పాటు చేసిన ఈ గృహం మందుబాబులకు స్థావరం అయింది. రాత్రి అయితే చాలు అతిథి గృహ ప్రాంగణం మద్యం సేవించే వారికి అడ్డాగా మారుతోంది. మద్యం సేవించడమే కాకుండా మద్యం సీసాలు చిందర వందరగా పారేస్తున్నారు. మద్యంతో పాటు తెచ్చుకున్న తినుబండారాలు అక్కడే పారేస్తున్నారు. ప్రభుత్వ అతిథి గృహం లోనే ఇలా వుంటే పట్టణంలోని ఖాళీ స్థలాలు, పార్క్ స్థలాల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో స్పెషల్ చెప్పనక్కర్లేదు. కాగా ప్రభుత్వ అతిథి గృహం వద్ద రాత్రి వేళల్లో ఒక సెక్యూరిటీ కూడా లేకపోవడం వల్లే ఐబీ అస్తవ్యస్తం అవుతుందని పలువురు అంటున్నారు.

ఐ.బీ లో పారిశుధ్యం కరువు..

ప్రభుత్వ అతిథి గృహంలో పారిశుధ్యం కరువైంది. అతిథి గృహం కు వచ్చేవారు వాడే వాటర్ బాటిళ్లు, తిన్న విస్తరాకులు ప్రాంగణంలో పారేస్తున్నారు. దీంతో అక్కడ పారిశుధ్యం కరువై కంపు కొడుతున్నది. ప్రభుత్వ అతిథి గృహంలో పని చేసే సిబ్బంది రాత్రి వేళల్లో లైట్లను వేసినా తమకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు లైట్లు ఆర్పేసి మరీ మద్యం సేవిస్తున్నారు మందుబాబులు. ప్రతి నిత్యం ఇలా జరుగుతున్న ఆర్ అండ్ బీ అధికారులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించడం లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులు వచ్చే స్థలంలో ఇలా ఉంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed