బాలిక మిస్సింగ్

by Disha Web Desk 22 |
బాలిక మిస్సింగ్
X

దిశ, కంది: సంగారెడ్డి పట్టణంలో ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న బాల సదనగరంలో ఉండే బాలిక అదృశ్యమైంది. పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... ఈ నెల 17న ఉదయం 5.30 గంటల సమయంలో పటాన్ చెరు మండలం ముత్తంగికి చెందిన అల్లిగొండ సంజన (9) గేటు దూకి పారిపోయిందని చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సత్తుల నీరజ తెలిపినారు. పారిపోయిన అమ్మాయి ఈ నెల 3న సంగారెడ్డి పట్టణ శివారులో హనుమాన్ నగర్ సమీపంలో బిక్షాటన చేస్తుండటంతో చైల్డ్ లైన్ ఉద్యోగి స్రవంతి అమ్మాయిని తీసుకొని వచ్చి బాలసదనంలో చేర్పించారు. ఎంత వెతికినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిస్తే సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ 08455-276333, పట్టణ సీఐ 8712656718 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

Next Story