ప్రారంభమైన ఎంపీ నామినేషన్ల పర్వం

by Disha Web Desk 15 |
ప్రారంభమైన ఎంపీ నామినేషన్ల పర్వం
X

దిశ, సంగారెడ్డి : జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. కాగా మొదటి రోజు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరపున కాంగ్రెస్ నాయకులు ఒక సెట్ నామినేషన్ ను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి అందజేశారు. అయితే మొదటి రోజు ఒకే నామినేషన్ రాగా ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది. ఇక శుక్రవారం రోజు జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.

Next Story

Most Viewed