అంబులెన్స్‌కు దారేది.. అరగంట పాటు ట్రాఫిక్‌లో నరకయాతన

by Disha Web Desk 19 |
అంబులెన్స్‌కు దారేది.. అరగంట పాటు ట్రాఫిక్‌లో నరకయాతన
X

దిశ, చేర్యాల: పట్టణంలోని స్థానిక అంగడి బజార్ వద్ద మంగళవారం ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ చేయడంతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అత్యవసరంగా వెళ్లాల్సిన అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో.. అంబులెన్స్ డ్రైవర్ నానా తంటాలు పడ్డాడు. చేర్యాల మండల కేంద్రంలో ప్రతి మంగళవారం సంత ఉంటుందని తెలిసి కూడా.. మున్సిపల్ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ నిర్వాహకులు పార్కింగ్‌కి తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రతి మంగళవారం వాహనదారులకు, ప్రయాణికులకు నరకం తప్పడం లేదు. ఇవాళ కూడా ఇష్టారాజ్యంగా వాహనాలను ప్రధాన రోడ్డుపై పార్క్ చేయడంతో అటుగా వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నానా అవస్థల మధ్య ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.


Next Story

Most Viewed