మద్యం ధరల ఆకస్మిక తనిఖీ.. షాపు యజమానులకు హెచ్చరకలు..

by Disha Web |
మద్యం ధరల ఆకస్మిక తనిఖీ.. షాపు యజమానులకు హెచ్చరకలు..
X

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో మద్యం ధరలపై ఈఎస్.గాయత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. గురువారం పట్టణంలోని పలు మద్యం దుకాణాలను సిబ్బందితో కలిసి ఆమె సందర్శించారు. పెరిగిన మద్యం ధరలు అమలు తీరుతెన్నులను తెలుసుకునేందుకు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రి వైన్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. మద్యంపై బ్రాండ్ ఆధారంగా గురువారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వం 20 నుంచి 25 శాతం వరకు ధరలను పెంచింది. ఈ నేపథ్యంలో వైన్ షాప్ లో ఉన్న పాత స్టాక్‌కు పెరిగిన ధరలకు అనుగుణంగా స్టిక్కరింగ్ చేసింది, లేనివి పరిశీలించారు. ఈ సందర్భంగా వైన్ షాప్ లో అనుసరించాల్సిన ధరల స్టిక్కరింగ్ తదితర విధానాన్ని సూచించారు. యజమానులు పెరిగిన ధరలకు అనుగుణంగా మసలుకోవాలని నిర్లక్ష్యం చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆమెతో పాటు సీఐ. అశోక్ కుమార్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story