- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
MLA : విద్యార్థులు లక్ష్యం దిశగా అడుగులు వేయాలి
దిశ, జిన్నారం: ప్రతి విద్యార్థి లక్ష్యం దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. జన్నారం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించే విధంగా ముందుకు సాగాలని సూచించారు. కళాశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధ్యాపకులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి, ఉత్తమ ఫలితాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ కుమార్, స్థానిక నాయకులు వడ్డే కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, జానా బాయి, గంగు రమేష్, రాజు గౌడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.