క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : సోనమ్ టెన్సింగ్ బూటియా

by Aamani |
క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : సోనమ్ టెన్సింగ్ బూటియా
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ సోనమ్ టెన్సింగ్ బూటియా అధికారులను ఆదేశించారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పుల్లూరు, రాజ గోపాలపేట గ్రామాలల్లో వికలాంగుల ఇండ్లను సందర్శించారు వారు వేస్తున్న ఓటింగ్ సరళిని ఎన్నికల అబ్జర్వర్లు సోనమ్ టెన్సింగ్ బూటియా, జయ శ్రీ భోజ పరిశీలించారు. అనంతరం భూంపల్లి పోలీస్ స్టేషన్, గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా పోలీస్ అబ్జర్వర్ సోనమ్ టెన్సింగ్ బూటియా మాట్లాడుతూ... చెక్ పోస్ట్ లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రతి వాహనం ను తనిఖీ చేయాలన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాలలో ఎక్కడైనా ఎన్నికలను ప్రభావితం చేసే ఏ అంశమైనా ప్రజల దృష్టికి వస్తే 8712667309 మొబైల్ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story