గొల్ల, కురుమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: వంటేరు ప్రతాప్ రెడ్డి

by Disha Web Desk 11 |
గొల్ల, కురుమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: వంటేరు ప్రతాప్ రెడ్డి
X

దిశ, ములుగు: గొల్ల, కురుమల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో యాదవ, కురుమ సంఘం భవన నిర్మాణానికి మండల ఎంపీపీ పాండు గౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డిలతో కలిసి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొల్ల, కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. సామాజికంగా యాదవ, కురుమలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని అన్నారు.

గత ప్రభుత్వాలు యాదవులను పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూశారని విమర్శించారు. యాదవ, కురుమల అభివృద్ధికి ఎంతో తోడ్పాటనందిస్తున్న సీఎం కేసీఆర్ కు యాదవ, కురుమల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం ట్రస్ట్ మాజీ చైర్మన్ హరి పంతులు, కృష్ణ గౌడ్ వార్డు సభ్యులు ప్రభాకర్, గణేష్, నరేందర్ రెడ్డి, రాజేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జుట్టు సుధాకర్, మేర వెంకటేష్, చెక్కలి రాములు, తలకొక్కుల రాములు, చిన్న బోయిని మల్లేష్, చెక్కలి చంద్రం, మేకల శ్రీనివాస్, చిన్న బోయిని లక్ష్మణ్, బొమ్మ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed