- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈ నెల 19 వరకు చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ డ్రైవ్
by Kalyani |

X
దిశ, మెదక్ టౌన్ : రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం మెదక్ జిల్లా కోర్టు కార్యాలయంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 19 వరకు చెక్ బౌన్స్ కేసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి ఎవరైనా కేసులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వచ్చే నెల 14న జిల్లా లోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షి దారులు ఇరుపక్షాల అంగీకారంతో తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
Next Story