ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు

by Disha Web Desk 15 |
ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు
X

దిశ, సంగారెడ్డి : మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపనున్నది. అందుకు గాను మెదక్ రీజియన్ నుంచి 135 ప్రత్యేక బస్సులను కేటాయించారు. అదే విధంగా రీజియన్ పరిధిలో ఇతర శైవ క్షేత్రాలకు భక్తులు వెళ్లేందుకు రవాణాకు ఇబ్బంది కలుగకుండా మరో 16 బస్సులను నడుపనున్నారు. మెదక్, జోగిపేట, సంగారెడ్డి, నర్సాపూర్, బాలానగర్, సదాశివపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, ఝరాసంఘం, శంకరంపేట, బోడ్మట్ పల్లి, జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుపనున్నది. మెదక్ నుంచి ఏడుపాయలకు 12 బస్సులు, జేబీఎస్ నుంచి బాలానగర్ మీదుగా 27 బస్సులు, రామాయంపేట నుంచి 3 బస్సులు, నర్సాపూర్ నుంచి 8 బస్సులు, శంకరంపేట నుంచి 6 బస్సులు, బోడ్మట్ పల్లి నుంచి 6, హైదరాబాద్ నుంచి 14, సంగారెడ్డి నుంచి 20, జోగిపేట నుంచి 7, జహీరాబాద్ నుంచి 17, సిద్దిపేట నుంచి 3, గజ్వేల్-ప్రజ్ఝాపూర్ నుంచి 2 బస్సులు మొత్తం 135 ప్రత్యేక బస్సులను ఏడుపాయల జాతరకు నడుతుపున్నట్లు ఆర్ఎం సుదర్శన్ తెలిపారు. వాటితో పాటుగా ఇతర శైవక్షేత్రాలకు మరో 16 బస్సులు తిరుగనున్నాయి. వీటిలో 8 బస్సులు జహీరాబాద్ నుంచి ఝరాసంగంకు, 3 బస్సులు శంకరంపేట నుంచి కొప్పోలు జాతరకు, మరో 3 బస్సులు సిద్దిపేట నుంచి వేములవాడకు, 2 బస్సులు దుబ్బాక నుంచి వేములవాడకు నడుపనున్నారు.

సాధారణ చార్జీలే వసూలు చేస్తాం : మెదక్ రీజియన్ రీజినల్ మేనేజర్ సుదర్శన్

మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులలో సాదారణ చార్జీలను వసూలు చేస్తాం. రీజియన్ పరిధిలో 135 ప్రత్యేక బస్సులు, ఇతర శైవక్షేత్రాలకు మరో 16 బస్సులను ఏర్పాటు చేశాం. అదే విధంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం, ఇతర శైవక్షేత్రాల దర్శనానికి వళ్లే ప్రయాణికులు 30 మంది కంటే ఎక్కువ ఉంటే వారి వద్దకే బస్సులను పంపిస్తాం. ఉమ్మడి జిల్లా ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణానికి నమ్మకమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి.


Next Story

Most Viewed