మిద్దెక్కిన తెల్ల బంగారం..!

by Disha Web Desk 22 |
మిద్దెక్కిన తెల్ల బంగారం..!
X

దిశ, ఝరాసంగం: ఈ ఏడాది పత్తి రైతులకు ధరలు లేక నష్టాన్ని కలిగించింది. సకాలంలో వర్షాలు కురువకపోవడం, పండించిన పంటకు సైతం ధరలు లేకపోవడంతో పత్తి రైతు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఏడాది పత్తి రైతులకు ధరలు లేక నష్టాన్ని కలిగించింది. సకాలంలో వర్షాలు కురువకపోవడం, పండించిన పంటకు సైతం ధరలు లేకపోవడంతో పత్తి రైతు కన్నీరుమున్నీరయ్యారు. పత్తి వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో పత్తి రైతులు తీవ్రంగా లబోదిబోమంటున్నారు. సీజన్ ​ప్రారంభంలో క్వింటాల్​కు రూ.7200/- వేల పెట్టి పత్తి కొన్న వ్యాపారులు.. ఇప్పుడు మార్కెట్‌కు పత్తి ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో రేటు బాగా తగ్గించారు. మధ్య దళారులు ఎక్కడికక్కడ సిండికేట్​గా మారి ధరలు తగ్గిస్తుండడంతో పత్తి రేటు క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ. 6500 వరకు పడిపోయింది... ప్రస్తుతం సీసీఐ కేంద్రాలు మూతపడడంతో చేసేదేమీ లేక ఝరాసంగం మండలం పరిధిలోని చిలేమామిడి, ఏడాకులపల్లి, జిర్లపల్లి, తదితర గ్రామాల్లో పత్తి రైతులు తమ ఇళ్ల వద్ద భద్రపరిచారు. మరి కొంతమంది రైతులు వారి వారి బంగ్లా (ఇల్లు పైన) పై పత్తిని భద్రపరిచారు. వచ్చే సంవత్సరమైనా పత్తి ధర పలుకుతుందని ఆశపడి రైతులు పత్తిని భద్రపరచుకున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed