అట్టహాసంగా ముగిసిన శతచండీ మహా యాగం

by Shiva Kumar |
అట్టహాసంగా ముగిసిన శతచండీ మహా యాగం
X

దిశ, ఝరాసంగం: దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీ శతచండీ మహాయాగం ఆదివారం ఘనంగా ముగిసింది. ముగింపు సందర్భంగా దేవాలయంలో చండీ అమ్మవారు భక్తులకు శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చింది. నవార్నవ మంత్ర హవనం, ప్రయచిత హోమాలు, బలి ప్రధానం, సువాసిని పూజ, కుమారి పూజ, కలిశోద్వాసన, మహా పూర్ణాహుతి, మహా దాశీర్వచనం, రుత్విక్ సన్మానం, వేద పండితులు, రిత్వికుల మంత్రోచ్ఛణల, మంగళ వాయిద్యాలు మధ్య మహా పూర్ణాహుతి నిర్వహించారు.

దేశం సుభిక్షంగా ఉండడం కోసం యాగం చేయడం అభినందనీయం

దేశ ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ చండీయాగం చేయడం అభినందనీయమని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ 108 అవధూత గిరి మహారాజ్, సోమేశ్వర శివాచార్య స్వామి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, కర్ణాటక హుమ్నాబాద్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ అన్నారు. మహా పూర్ణాహుతి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూర్ణాహుతి అనంతరం ఆలయ చైర్మన్ నీలా వెంకటేశం, కార్యనిర్వహణ అధికారి శశిధర్ పూలమాల శాలలతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Next Story

Most Viewed