మన ఊరు మన బడికి నిధుల కొరత లేదు.. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన

by Disha Web Desk 14 |
మన ఊరు మన బడికి నిధుల కొరత లేదు.. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: మన ఊరు మన బడి పథకానికి నిధులు కొరత లేదని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఆర్ అండ్ బీ, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ, నిర్మాణ ఎజెన్సీలు, ఏఈవో, ఎవోలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి దేవసేన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక బోధన పద్ధతులను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యాలను వెలికి తీసేలా బోధన సాగాలని సూచించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడంపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పారు.


మన ఊరు మన బడిలో భాగంగా జిల్లాలో 250 పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. గజ్వేల్ గడా అథారిటీ కింద చేపట్టిన టాయ్ లెట్ పనులను త్వరగా పూర్తి చేయ్యాలన్నారు. అంతకు ముందు సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జెడ్పీ హైస్కూల్, బాలికల ఉన్నత పాఠశాలలను రాష్ట్ర దేవసేన పరిశీలించారు. ఈ సందర్భంగా అయా పాఠశాలల్లో జరుగుతున్న విద్యా బోధన, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, సమగ్ర శిక్ష అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed