నా కొడుకుని కాపాడండి.. కన్నీటి పర్యంతమైన ఓ తల్లి!

by Aamani |
నా కొడుకుని కాపాడండి..  కన్నీటి పర్యంతమైన  ఓ తల్లి!
X

దిశ,చిన్నకోడూరు : నా కొడుకును కాపాడండి మహా ప్రభు అంటూ ఓ తల్లి ఆవేదనను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె బోరున విలపించింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూరు గ్రామానికి చెందిన కొమ్ము రాజుల వెంకవ్వ- మల్లయ్య లకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.పెద్ద కుమారుడు నాగరాజు గ్రామంలో టైర్ పంక్చర్ షాపును నడుపుతున్నాడు. గత శనివారం రాత్రి మా బండి పంక్చర్ అయ్యిందనీ చేయాలంటూ కొందరు వ్యక్తులు ఫోన్ చేసి నా కొడుకును తీసుకుపోయిరాని తెలిపింది. తీరా అక్కడికి పోయాక మేము పోలీసులము అంటూ మా వాడిని తీవ్రంగా కొట్టారని పేర్కొంది. మరుసటి రోజు మేము చిన్నకోడూరు పోలిస్టేషన్ లో మా వాడు ఎడని అడిగితె మాకు తెలియదని బదులిచ్చారంది. తప్పి పోయాడనీ కేసు పెట్టమన్నారాని తెలిపింది.

మరో రోజు నీ కొడుకు హైదరాబాద్ లోని మత్తు పదార్థాలను వదిలించే ఓ ప్రైవేట్ సంస్థ (డి అడిక్షన్ ) లో ఉన్నాడని తెలిపారు .నేను అక్కడికి వెళ్లగా చూడడానికి అనుమతి లేదని నిరాకరించారని, మా వాడిని చూసే వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళేది లేదని భీష్మించడంతో 30 సెకండ్లు మాత్రమే నా కొడుకును చుడానిచ్చారని ఆమె బోరున విలపించింది. నా కుమారుడు ఒంటినిండా గాయాలతో కనిపించాడని పేర్కొంది. నా కొడుకును కూడా నాకు చూపించలేని అధికారాలు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించింది. మంచి వాడికి మత్తు పదార్థాలు ఎక్కించి మతిస్థిమితం లేని వాడిని తయారు చేసేలా ఉన్నారంది. వారి చేతిలో నా కుమారుడు చనిపోయే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా ఇద్దరు కొడుకులకు మద్యం తాగే అలవాటు కూడా లేదనీ , మద్యం తాగని నా కొడుకుకు మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఎక్కడుంటుందని ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

నా కోడలు పోలీసులకు లేనిపోనివన్నీ చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. నా కొడుకును తీసుకొచ్చి నాకు అప్పగించాలని పోలీసులను వేడుకున్న పట్టించుకోవడం లేదన్నారు. మత్తు పదార్థాలు తీసుకున్నాడని పోలీసులకు నిర్ధారణ అయితే జైల్లో పెట్టాలి కానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, చిత్రం హింసలకు గురి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవడమేంటన్నారు. మా వాడిని అప్పగించాలని, చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రైవేటు సంస్థ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎంత ప్రాధేయపడినా పట్టించుకోవడం లేదన్నారు. నా కొడుకు ను అప్పగించకపోతే నా చావును పోలీసులు కల్లారా చూస్తారని హెచ్చరించింది. జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేసి, నా కొడుకును నాకు అప్పగించాలని ఆ తల్లి వేడుకుంటుంది. ఆ తల్లి విన్నపాన్ని పోలీసులు కనికరిస్తారా లేదా...వేచి చూద్దాం...

ఎస్సై వివరణ..

ఈ సంఘటనపై చిన్నకోడూరు ఎస్సై బాలకృష్ణ ను వివరణ కోరగా వారి కోడలు ప్రభుత్వ ఆమోదం పొందిన డి అడిక్షన్ సంస్థలో చేర్పించిందని తెలిపారు. ఆ డి అడిక్షన్ యజమానితో ఫోన్ లో మాట్లాడామని నాగరాజు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.ఆమె మాకు అందుబాటులోకి రాలేదని వస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed