ఉపాధి హామీ కూలీలకు భోజన వసతి కల్పించిన సర్పంచ్..

by Kodari Anjali |

కొక్కొండ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహిస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు.

ఉపాధి హామీ కూలీలకు భోజన వసతి కల్పించిన సర్పంచ్..
X

దిశ, ములుగు: ములుగు మండలంలోని కొక్కొండ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహిస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ విజేత వాసుదేవ్ గౌడ్ మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూలీల ఆరోగ్య సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామాభివృద్ధిలో ఉపాధి హామీ కూలీల పాత్ర ఎంతో కీలకమైందని, వారి సంక్షేమానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కూలీలు కూడా సర్పంచ్ చూపిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ పెద్దలు, కూలీలు పాల్గొన్నారు.

Next Story