- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయాలి
by Kodari Anjali |
వన మహోత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

X
దిశ, జగదేవపూర్: వన మహోత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తిగుల్ లో నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సరీలో పెంచిన మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. త్వరలోనే వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. నర్సరీలో ఉన్న మొక్కలను వేరుచేసి నాటేందుకు సిద్ధం చేయాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. మండలంలోని గ్రామాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వానకాలం ప్రారంభమైంది కాబట్టి గ్రామాలలో పారిశుద్ధ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ ఖాజా, కార్యదర్శి నరేష్ రెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Next Story






