రోడ్డు మీద ఎస్ఐని చూసి ఆ పని చేసిన యువకుడు.. సీన్ కట్ చేస్తే..!

by Disha Web Desk |
రోడ్డు మీద ఎస్ఐని చూసి ఆ పని చేసిన యువకుడు.. సీన్ కట్ చేస్తే..!
X

దిశ, కంది: సంగారెడ్డి జిల్లా పరిధిలో వరుసగా బైకులు చోరీ చేస్తున్న వ్యక్తిని సంగారెడ్డి రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎందుకు సంబంధించిన వివరాలను సీఐ శివలింగం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీదర్ జిల్లాకు చెందిన మహిపాల్ రెడ్డి (33) సంగారెడ్డి జిల్లా పరిధిలో వరుసగా బైకులను చోరీ చేసేవాడు. దొంగిలించిన ద్విచక్ర వాహనాలను అదే బీదర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి అమ్మేవాడు. కాగా ఈ నెల 23న రాత్రి 10:00 గంటలకు పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వద్ద సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తన సిబ్బందితో వాహనాల తనఖీ చేస్తుండగా జహీరాబాద్ వైపు నుండి TS 15 EM 7341 నంబర్ గల స్పెండర్‌పై వస్తూ.. పోలీసులను చూసి పారిపోబోయాడు. అతడిపై అనుమానం రావడంతో వెంబడించి పట్టుకున్నారు.

మోటార్ సైకిల్‌ను తనిఖీ చేయగా.. అతడి వద్ద ఎలాంటి డాకుమెంట్స్ లేవు. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్ద ఉన్న స్పెండర్ బైక్‌ను దానిని కవలంపేట్ బస్సు స్టాప్ వద్ద చోరీ చేసినట్టు నేరం ఒప్పుకున్నాడు. గతంలో జహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుండి వచ్చిన తర్వాత ఏడాది నుండి జహీరాబాద్, సదాశివపేట, మునిపల్లి, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 20 ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. ఇందులో మొదటి వద్ద నుంచి ఆరు వాహనాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మేరకు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ వివరించారు.


Next Story

Most Viewed