గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..

by Disha Web Desk 11 |
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి..
X

దిశ, నర్సాపూర్: గుండెపోటుతో ఓ ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట మండలం ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన భిక్షపతి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టీఎస్ ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సంగారెడ్డి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో నర్సాపూర్ బస్టాప్ వద్దకు రాగానే ఆన్ డ్యూటీలోనే సడన్ గా చాతి నొప్పి వచ్చింది. తోటి ఉద్యోగులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.


Next Story

Most Viewed