టీచర్ ఇంట్లో అర్ధరాత్రి చోరీ

by Dishanational1 |
టీచర్ ఇంట్లో అర్ధరాత్రి చోరీ
X

దిశ, కంది: సంగారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో దుండగుడు చోరికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈనెల 23న అర్ధరాత్రి తర్వాత జరిగింది. పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ వెనుకల గల సాయి నగర్ లో నివాసం ఉంటున్న దువ్వ గిరిబాబు ఓ పాఠశాలలో ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నాడు. అయితే ఈనెల 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి తన చెల్లి ఇళ్లయిన నల్గొండకి వెళ్లారు. తిరిగి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉన్నది. లోపలికి వెళ్లి చూసేసరికి కబోర్డ్ లో బట్టలన్నీ చిందరవందరుగా పడేసి ఉన్నాయి. అయితే బీరువాలో దాచిపెట్టిన ఒక బంగారు బిస్కెట్ తోపాటు నగదును గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీం బృందం ఇంటిని పరిశీలించి, పక్క వీధిలో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా సేకరించారు. చోరికి పాల్పడ్డది ఒకరే వ్యక్తి అని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అనుమనిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అత్యవసరంగా ఎక్కడికైనా ఊరికి వెళ్లాల్సి వస్తే ముందస్తుగా తమకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో గస్తీ వేస్తామని ఆయన సూచించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Next Story