ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలి : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

by Disha Web Desk 1 |
ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలి : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, చేగుంట : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లారీల ద్వారా ఎగుమతి అవుతోన్న ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. మాసాయిపెట్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిన లారీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాసాయిపేట లో ఉన్న గోదాములను ఆయన పరిశీలించారు.

చేగుంట మాసాయిపేట మండలాల కోసం గోదాములను కేటాయించినట్లు అధికారులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీ వెంకట సాయి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ వారికి ప్రభుత్వం కేటాయించిన గోదామును పర్యవేక్షించి రైతులకు ఎలంటి ఇబ్బంది కాకుండా ధాన్యం త్వరితగతిన చేసేలా రైస్ మిల్ యజమానులకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఇబ్రహీంపూర్ ఛైర్మెన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ తానిషా , చేగుంట జడ్పీటీసీ ముదం శ్రీనివాస్ , చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, పోతాంశెట్టిపల్లి సర్పంచ్ నెల్లూరు, చేగుంట పార్టీ అధ్యక్షులు వెంగల్ రావు , రైస్ మిల్ యజమాని మోహన్ కృష్ణ, ఇబ్రహీంపూర్ సొసైటీ సెక్రెటరీ శ్రీనివాస్, పోతనపల్లి మాజీ సర్పంచ్ జగన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story