ఇందిరా గాంధీని ప్రధానిని చేసిన ఈ జిల్లా కాంగ్రెస్ కంచుకోట : రేవంత్ రెడ్డి

by Dishanational2 |
ఇందిరా గాంధీని ప్రధానిని చేసిన ఈ జిల్లా కాంగ్రెస్ కంచుకోట : రేవంత్ రెడ్డి
X

దిశ,మెదక్ : ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసింది ఉమ్మడి మెదక్ జిల్లా , ఇది కాంగ్రెస్ కోట అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.ఆదివారం కాంగ్రెస్ నాయకుల‌తో కలసి మెదక్ చర్చిని సందర్శించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చర్చిలో కోరుకున్నవన్నీ నెరవేరాలని,. దేశ, రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కులాలు మతాల మధ్య కొందరు చిచ్చు పెడుతున్నారని బీజేపీ‌ని ఉద్దేశించి అన్నారు. సర్వమతాలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

భారీ బైక్ ర్యాలీ

మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి రాక సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై..కాంగ్రెస్,జై.. జై..కాంగ్రెస్ అనే నినాదాలు మిన్నంటాయి.

చర్చిలో రేవంత్ రెడ్డి‌కి సన్మానం

మెదక్ చర్చి‌లో గురువులు రేవంత్ రెడ్డికి శాలువ‌తో సన్మానించారు. బిషప్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ,మాజీ ఉప ముఖ్యంత్రి దామోదర రాజనర్సింహలను సన్నానుచారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు జ్ఞాపికను రేవంత్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు,మెదక్,సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి,నర్సారెడ్డి, మ్యాడం బాలకృష్ణ,సుప్రభాత రావు,పల్లె రామచంద్ర గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed