ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా..? అధికారులపై ప్రజాప్రతినిధుల అసహనం

by Dishanational1 |
ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా..? అధికారులపై ప్రజాప్రతినిధుల అసహనం
X

దిశ, సిద్దిపేట: గ్రామాలల్లో చేతికి అందేలా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా, మండల పరిధిలో ఇటీవల యువ రైతు విద్యుత్ షాక్ కు గురై మరణించాడు. గ్రామాల్లో వేలాడే విద్యుత్ తీగలను యుద్ధ ప్రాతిపదికన సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ప్రజాప్రతినిధులు అదేశించారు. చిన్నకోడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి అధ్యక్షతన గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ... ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు స్వర్గసీమలా మారాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను, తద్వార మండలంను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో అల్లీపూర్ సొసైటీ చైర్మన్ సధానందం, ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యాధికారి సరిత, వ్యవసాయ అధికారి జయంత్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed