100 రోజుల్లో హామీలు నెరవేరుస్తాం : బీహార్ సీఎల్పీ నేత

by Disha Web Desk 8 |
100 రోజుల్లో హామీలు నెరవేరుస్తాం : బీహార్ సీఎల్పీ నేత
X

దిశ , జహీరాబాద్: అధికారం చేపట్టిన 100 రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని , రాజస్థాన్, కర్ణాటకలో చేపట్టిన హామీల అమలే ఇందుకు నిదర్శనమని బీహార్ సీఎల్పీ నేత ..డాక్టర్.షకీల్ అహ్మద్ ఖాన్ అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం పార్టీ బలోపేతానికి చేపట్టిన నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం జహీరాబాద్ నియోజకవర్గాన్ని సందర్శించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..119 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ పర్యాయం జరగనున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందన్నారు. తుక్కుగూడ సభలో సోనియా గాంధీ యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన ఆరు హామీలన్నీ 100 రోజుల్లో నెరవేర్చనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల్లో ని ప్రభుత్వాలు పరస్పరం సహకారించుకుంటున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం తన అనుయాయుల కోసం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో రెండవ స్థానంలో అదానిని నిలబెట్టేందుకు ఎంతకైనా దిగజారుతుందాన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు.119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు.

కర్ణాటక , రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చిందన్నారు. మహిళలు రైతులు, యువతల కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రూ.70 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతుల మన్ననలు అందుకున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులను చంపుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90 శాతం ప్రజానీకానికి నష్టం చేస్తూ కొందరికి ప్రయోజనాల్ని చేకూర్చే విధానపరమైన నిర్ణయాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, సోనియాగాంధీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతుందని స్పష్టం చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మా శాకీర్ మాట్లాడుతూ విపక్షాల పతనం ప్రారంభమైందని, త్వరలో కాంగ్రెస్ అధికారం చేపట్టనుందన్నారు. తుక్కుగూడ సభతో అదే తేటతెలమైన అన్నారు. ఈ సందర్భంగా విపక్షాలు ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తున్నది వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియాకు అధికారం ఇవ్వడమే ఏకైక లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో చీఫ్ కోఆర్డినేటర్ ఏ. చంద్రశేఖర్, ఎంపీపీ గిరిధర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కండెం. నరసింహులు, భాస్కర్, ఎజీ.రాములు, కాజా మియా, భాస్కర్ రెడ్డి, శౌకత్ , షకీల్, ముల్తాని, ఇమామ్ పటేల్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story