జహీరాబాద్‌లో అనుమతులు లేని ఆసుపత్రులు సీజ్

by Disha Web Desk 18 |
జహీరాబాద్‌లో అనుమతులు లేని ఆసుపత్రులు సీజ్
X

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. గాయత్రి దేవి సీజ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు పది రోజులలో రాష్ట్రంలోని అనుమతులులేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం కోసం ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. గాయత్రీ దేవి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ లపై చర్యలు తీసుకున్నారు. స్పర్శ స్కిన్ మరియు ఈఎన్టీ, సిద్ధి హాస్పిటల్, యుద్ధ డయాగ్నస్టిక్ సెంటర్ లను సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్స్, పాలిక్లినిక్స్, ఫిజియో థెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవడానికి పోగ్రామ్ ఆఫీసర్లను నియమించినట్లు సమాచారం.Next Story