పటాన్ చెరు గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Disha Web Desk 1 |
పటాన్ చెరు గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ, అమీన్ పూర్: పటాన్ చెరు గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం బీరంగూడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళననానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీరంగూడ కమాన్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీతో ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 60లక్షల మంది సభ్యత్వంతో బీఆర్ఎస్ పార్టీలో అజేయ శక్తిగా నిలిచిందన్నారు. పార్టీ పటిష్టతకు వెన్నుముకగా నిలిచిన ప్రతి కార్యకర్తనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గడపగడపకు వివరించాలని కోరారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఉన్న ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని రూ.కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

అమీన్ పూర్ గ్రామాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసి.. ప్రతి కాలనీని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రూ.75 కోట్లతో 100 ఫీట్ల రహదారిని నిర్మించడంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా దిశగా నాలుగు భారీ రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. మున్సిపల్ చైర్మెన్ తుమ్మల పాండు రంగారెడ్డి మాట్లాడుతూ అమీన్ పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో పటాన్ చెరులో గులాబీ జెండా ఎగురవేసి మహిపాల్ రెడ్డిని గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని పాండు రంగారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో అమీన్ పూర్ ఎంపీపీ దేవానందం, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, బీఆర్ఎస్ మునిసిపాలిటీ అధ్యక్షులు బాల్ రెడ్డి, మండలాధ్యక్షులు ఈర్ల రాజు, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, అయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed