హరితహారం‌లో డేంజర్ చెట్లు.. భయపడుతున్న ప్రజలు

by Dishanational2 |
హరితహారం‌లో డేంజర్ చెట్లు.. భయపడుతున్న ప్రజలు
X

దిశ,అల్లాదుర్గం : కోనో కార్పస్ మొక్కలను పలు గ్రామపంచాయతీ హరితహారం‌లో భాగంగా నాటారు. ప్రభుత్వం వీటిని హరితహారం‌లో నాటోద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మొక్కలు డ్రైనేజీ, భూగర్భ జలాలు బోరుబావులకు ,నాశనం చేస్తాయి. వీటివల్ల ఏర్పడే పుప్పడి వల్ల ప్రజలకు ఎలర్జీ వస్తుంది. అతి తక్కువ సమయంలో తొందరగ అతి వేగంగా పెరుగుదలకు ,సుందరీ కరణ కోసం వాడుతున్నారు. కానీ ఈ మొక్కల వల్ల కలిగే నష్టాలను ఎవరు గమనించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నూతన గ్రామపంచాయతీ నడిమితాండ ఆవరణలో ఈ మొక్కలను నాటారు అలాగే గొల్ల కుంట తండా గ్రామపంచాయతీ రహదారుల వెంట కొనో కార్పస్ మొక్కలను నాటారు .కొనో కార్పస్ నాటిన మొక్కలను నిషేధించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన గొల్ల కుంట, నడిమితాండ పంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చెట్లు విషపూరితమైనవిగా భావిస్తున్నారు, మొక్కలతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ,వాటి యొక్క ఆకులను వాసన చూసిన వాటిని తాగిన,చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు భావిస్తున్నారు. వాటి యొక్క ఆకులు మొక్కలను చూడడానికే పనిచేస్తుంది. వేర్లు చాలా బలమైనవిగా భూమిలో 80 మీటర్ల వరకు లోతులో పాతుకు పోతాయి వేర్లతో భూగర్భ జలాలు ఎక్కువగా తీసుకుంటాయి, భూమిలో ఉన్న మంచినీళ్లు ,డ్రైనేజీ, వేరే నిర్మాణాలకు కూడా ఆటంకం కలిగిస్తుంటాయి .ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొనో కార్పస్ మొక్కలను తొలగించి వీటికి బదులుగా, వేప,వేరే మొక్కలను నాటాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story