ఎన్‌డీఎస్‌ఎల్ తెరిచేందుకు వంద రోజులు కాలేదా..!

by Disha Web Desk 22 |
ఎన్‌డీఎస్‌ఎల్ తెరిచేందుకు వంద రోజులు కాలేదా..!
X

దిశ, మెదక్ ప్రతినిధి: అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ కర్మాగారం తెరిపిస్తామన్న అధికార పార్టీకి ఇంకా వంద రోజులు కాలేదా అని కాంగ్రెస్ అభ్యర్థి మైనం పల్లి రోహిత్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ చిట్యాల, జానకం పల్లి, మంబోజి పల్లి, గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... రైతులు, స్థానికులకు ఉపాధి కలిగే నిజాం షుగర్ కర్మాగారం ఇంకెప్పుడు తెరుస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న కేసీఆర్ కర్మాగారాన్ని పూర్తిగా మూసి వేసి కార్మికులను రోడ్డు పాలు చేశారని అన్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఎందుకు నిజాం షుగర్ కర్మాగారం పై పట్టించుకోలేదని ప్రశ్నించారు. అభివృద్ధి చేశామని చెప్పే అధికార పార్టీ అభ్యర్థి ఎన్ని గ్రామాలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించారు. ఎంత మందికి ఇచ్చారో ప్రచారంలో చెప్పాలని అన్నారు.

ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన గ్రామాల్లో ఓట్లు కాంగ్రెస్ ఓట్లు అడుగుతారని, మీరు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన గ్రామాల్లో ఓట్లు అడిగేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఉత్తి హామీలు ఇచ్చి రెండు సార్లు పద్మా దేవేందర్ రెడ్డి మోసం చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ది చెప్పలేక తప్పడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అధికారం లేకున్నా సొంత డబ్బులతో సేవ చేశామని, ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏమిటో చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆరు గ్యారంటీలు పక్కగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ చౌదరి, మండల అధ్యక్షుడు శంకర్, యూత్ అధ్యక్షుడు రాజు, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హఫీజ్, ఎంపీటీసీలు శ్రీహరి, ప్రభాకర్ సిద్దాగౌడ్, పేరూరు ఉప సర్పంచ్ జానకీ రాం రెడ్డి, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు మహేష్ గౌడ్, మ్యాకల ఆంజనేయులు, శేషు కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు మురళీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story