- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
MLA : నవ సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
దిశ,పటాన్ చెరు : నవ సమాజ నిర్దేశకులైన ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 3000 మంది ఉపాధ్యాయులకు సొంత నిధులచే ఐదు లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా అందించబోతున్నటు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన పటాన్ చెరు నియోజకవర్గ స్థాయి ప్రైవేటు పాఠశాలల గురుపూజోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అన్నారు. ప్రతి విద్యార్థిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందన్నారు.
విద్యతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రతి పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారు శేఖర్ రావు, రాష్ట్ర కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు సాయి తేజ, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.