తూతూ మంత్రంగా చర్యలు.. నామ మాత్రంగా నోటీసు..

by Disha Web Desk 20 |
తూతూ మంత్రంగా చర్యలు.. నామ మాత్రంగా నోటీసు..
X

దిశ, అల్లాదుర్గం : అక్రమంగా హరితహారం చెట్లను నరికివేసిన యాజమాన్యం పట్ల చర్యలు తీసుకోవాల్సిన గ్రామపంచాయతీ అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకున్న సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నడిమితండాలో చోటుచేసుకుంది. దిశ పత్రిక పలువాస్తవ కథనాలను ప్రచురిస్తూ వెలుగులోకి తీసుకువచ్చిన కథనాల పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం రైస్ మిల్ యజమాన్యం పై చర్యలు తీసుకోకుండా తూతూ.. మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. విద్యుత్ లైన్ కోసం చెట్లను తొలగించి యథేచ్ఛగా చెట్ల నరికివేత అనే శీర్షిక ను ప్రచురించి వెలుగులోకి తీసుకువచ్చింది. చర్యలకై అధికారులను వివరణ కోరగా దిశ పత్రికలో వార్త ప్రచురితమైంది కనుక చర్యలు తీసుకుంటామని తెలుపడం ఆశ్చర్యకరమైన విషయం.

చర్యలు తీసుకొని సదురు వ్యక్తిపై జరిమానాలు విధించాల్సి ఉండగా తొలగించిన చెట్లకు బదులు 30 చెట్లను నాటండి మరల ఇలాంటి చర్యలకు పాల్పడితే పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తామనడం పలువురిని విస్మయానికి గురి చేసింది. హరితహారం చెట్లను నరికివేస్తే గ్రామపంచాయతీ అధికారులు సదరు వ్యక్తులకు, సంస్థలకు, జరిమానాలు విధించి మరల అటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సింది పోయి, ఇష్టానుసారంగా నోటీసు జారీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో కూడా ఇలాంటి సమాధానాలు ఎక్కడ కూడా ఎప్పుడు కానరాలే కానీ ప్రస్తుత కాలంలో ఇలా సమాధానం ఇస్తూ అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed