బలహీన వర్గాల ముద్దు బిడ్డ నీలం మధు

by Disha Web Desk 15 |
బలహీన వర్గాల ముద్దు బిడ్డ నీలం మధు
X

దిశ, మెదక్ ప్రతినిధి : బలహీన వర్గాల ముద్దు బిడ్డ నీలం మధు అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇంఛార్జి రాజిరెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాచవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ లు వంద రోజుల్లో అమలు చేసి మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో మూతబడిన ఎన్ఎస్ఎఫ్ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటే ప్రజలకు నమ్మకం

కాబట్టి గత ఎన్నికల్లో రాష్ట్రంలో అవకాశం కల్పించారని అన్నారు. మరింత ఉత్సాహంతో అభివృద్ధి ముందుకు సాగాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బడుగు, బలహీనర్గాలకు చెందిన నీలం మధు ప్రజల మధ్య ఉండి మీ కష్ట సుఖాల్లో ఉంటాడని తెలిపారు. బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలిపేందుకు అభ్యర్థులే దొరకడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి ఉసురు తగిలిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాదని అన్నారు. ఆ పార్టీలో చివరికి ఐదుగురు మాత్రమే మిగులుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బొజ్జ పవన్, వెంకటరమణ, శ్రీనివాస్ చౌదరి, మధు తో పాటు పలువురు పాల్గొన్నారు.

Next Story