నర్సాపూర్ ఎంపీపీకి పదవీ గండం

by Disha Web Desk 15 |
నర్సాపూర్ ఎంపీపీకి పదవీ గండం
X

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ మండల పరిషత్ అధ్యక్షురాలు జ్యోతి సురేష్ నాయక్ కు పదవీగండం ఏర్పడింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి ఎంపీపీగా కొనసాగుతుందని చిప్పలతుర్తి ఎంపీటీసీ సంధ్యారాణి నాయక్ 2020 లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో శుక్రవారం నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి పై జిల్లా కలెక్టర్ సమక్షంలో విచారణ సాగింది. విచారణకు ఎంపీపీ జ్యోతి, చిప్పలతుర్తి ఎంపీటీసీ సంధ్యారాణి నాయక్ హాజరయ్యారు. జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన విచారణలో ప్రస్తుతం జ్యోతి సురేష్ వయసుకు సంబంధించిన తప్పుడు ధృవీకరణ పత్రాలను పెట్టి ఎంపీపీగా కొనసాగుతుందని తేలినట్టు సమాచారం.

స్కూల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ తదితర గుర్తింపు కార్డుల కు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నట్టు విచారణ లో తేలినట్టు సమాచారం. విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా పడిందని, అభియోగం నిజమైతే ఎంపీపీ పదవిపోవడంతో పాటు కేసు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అయితే ఎంపీపీ ఎన్నిక సమయంలో నర్సాపూర్ మండలంలో బీ ఆర్ఎస్ పార్టీకి ఐదు ఎంపీటీసీ స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి ఐదు ఎంపీటీసీ స్థానాలు రావడంతో అప్పుడు ఎన్నికల అధికారులు డ్రా తీశారు. బీ ఆర్ఎస్ పార్టీ నుంచి చిప్పలతు ర్తి ఎంపీటీసీ సంధ్యారాణి నాయక్, కాంగ్రెస్ పార్టీ నుంచి జ్యోతి సురేష్ నాయక్ పోటీలో నిలిచారు. డ్రాలో ఎంపీపీ జ్యోతి పేరు వచ్చింది. అప్పటినుంచి జ్యోతి ఎంపీపీగా కొనసాగుతున్నారు. కాగా నరసాపూర్ ఎంపీపీ జ్యోతి పై విచారణ సాగిన విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed