దరువు అంజన్నకు నంది అవార్డు

by Disha Web Desk 15 |
దరువు అంజన్నకు నంది అవార్డు
X

దిశ, దౌల్తాబాద్ : తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో జరిగిన నంది అవార్డుల కార్యక్రమంలో ప్రజా కవి, రచయిత దరువు అంజన్నకు ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా ఉత్తమ నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. విమలక్క మాట్లాడుతూ దరువు అంజన్న తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1995లో సిద్దిపేట కేంద్రంగా, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్నో పోరాటాలు సాగించాడని, దాదాపు తెలంగాణ రాష్టం మొత్తం పల్లె పల్లె తిరిగి ఉద్యమ భావ జాలాన్ని, తెలంగాణ వెనకబాటు తనాన్ని తన పాట ద్వారా వినిపించాడని గుర్తు చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దరువు అంజన్న తెలంగాణలో అందరికీ సుపరిచితుడని కొనియాడారు. కార్యక్రమంలో ఏపూరి సోమన్న, ప్రజాకవి భైరగి, నేర్నాల కిషోర్, గిద్దె రాంనర్సయ్య, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, దార దేవేందర్, వెన్నెల, యాకుబ్, దమ్మన్నపేట రాజు, బుల్లెట్ వెంకన్న, సురేందర్, రమేష్, మల్లంపల్లి రాజు, శైలజ, యాకన్న, స్వామి, సంజీవ్, అంజలీ 500 మంది కవులు, కళాకారులు పాల్గొన్నారు.



Next Story