ఖాతాదారులను మోసం చేసిన ముత్తూట్ మేనేజర్..

by Sumithra |
ఖాతాదారులను మోసం చేసిన ముత్తూట్ మేనేజర్..
X

దిశ, నర్సాపూర్ : కంచె చేను మేసిన చందంగా తను పనిచేస్తున్న సంస్థకే టోకరా పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ముత్తూట్ మినీ ఫైనాన్స్ లో మేనేజర్ గా పని చేసే ఒక వ్యక్తి ఖాతాదారులను మోసం చేసి కంపెనీకి ఏడు లక్షలకు పైగా నగదు టోకరా పెట్టిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ పట్టణంలో గల ముత్తూట్ మినీ ఫైనాన్షియస్ ఆఫీస్ ను 3 -10 - 2024 న ప్రారంభించారు. ఆఫీసులో మేనేజర్ గా శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామానికి చెందిన గుండా రాజు పని చేసేవాడు.

వారికి పరిచయం ఉన్నటువంటి గుండె సురేష్, గుండా ఆకాష్, ప్రవీణ్ లతో కలిసి నకిలీ బంగారం, బంగారం తూకంలో తారుమారు చేసి అక్షరాల 7,10,356 రూపాయలను బ్యాంకు యాజమాన్యాన్ని మోసం చేసి ఆఫీస్ కి రాకుండా తప్పించుకొని తిరగడంతో ఇదే విషయమే ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ రీజనల్ మేనేజర్ ముప్పాల రాజు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు. విచారణ చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపారు.

Next Story

Most Viewed