యువకుడిపై ఎమ్మెల్యే చిర్రుబుర్రు... బట్టేబాజ్ అంటూ దుర్భాషలాడుతూ...

by Disha Web |
యువకుడిపై ఎమ్మెల్యే చిర్రుబుర్రు... బట్టేబాజ్ అంటూ దుర్భాషలాడుతూ...
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ పథకం యొక్క డబ్బులు రావట్లేదన్నందుకు అందరి ముందు ఓ యువకుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిర్రుబుర్రాడాడు. బట్టేబాజ్ అంటూ దుర్భాషలాడుతూ రెచ్చపోయాడు. అంతేకాదు.. వీడిని లోపల వేయండంటూ పోలీసులకు ఆదేశిలిచ్చాడు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పెళ్లైన ప్రతి ఒక్కరికీ కళ్యాణ లక్ష్మీ వచ్చిందా అంటూ అక్కడున్నవారందరినీ అడిగాడు. ఈ క్రమంలో ఓ యువకుడు పథకం డబ్బులు రావట్లేదంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఆ యువకుడిపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో పైరయ్యాడు. బట్టేబాజ్ అంటూ దుర్భాషలాడుతూ వీడిని లోపల వేయండంటూ పోలీసులకు ఆదేశిలిచ్చాడు అందు అని అందులో పేర్కొన్నారు.

Next Story

Most Viewed