కాలుష్యకారక జలాలు రాకుండా చేసి గండిగూడెం చెరువును అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే

by Kodari Anjali |

అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం చెరువులోకి కాలుష్య జలాలు చేరకుండా ప్రత్యేక కాలువ చేపట్టి చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.

కాలుష్యకారక జలాలు రాకుండా చేసి గండిగూడెం చెరువును అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే
X

దిశ, అమీన్ పూర్: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం చెరువులోకి కాలుష్య జలాలు చేరకుండా ప్రత్యేక కాలువ చేపట్టి చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం గండిగూడెం చెరువును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా చెరువు అలుగు పెంచడం మూలంగా సమీపంలోని ఖాజిపల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాకాలంలో నీటిమట్టం పెరిగి ఇళ్ళలోకి నీళ్లు చేరుతున్నాయని ఇటీవల ప్రజలు తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందని పేర్కొన్నారు. అలుగు మట్టాన్ని పూర్వస్థితికి తీసుకుని రావడంతో పాటు.. పరిశ్రమల నుండి కాలుష్య జలాలు చెరువులోకి చేరకుండా చెరువు సమీపం నుండి ప్రత్యేక కాలువ నిర్మించి వాటిని బయటకు పంపించడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమలు కాలుష్య జలాలు వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, రాజు, గణేష్, నవీన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story