అవగాహణ లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే ఎలా..?

by Disha Web |
అవగాహణ లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే ఎలా..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈవెంట్స్ లో మిస్ అయిన వారికి అవకాశం ఇవ్వాలంటూ అవకాశవాద రాజకీయాలకు తెరలేపారని మంత్రి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో పోలీస్ నియామకాల పరీక్షల్లో ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లకే పరిమితమైందని మాట్లాడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. విమర్శించే నాయకులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఉద్యోగాలు పొందినవారు కనబడటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. గత ఏ ప్రభుత్వాలు భర్తీ చేయని విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు స్పష్టం చేశారు. స్థానికులకు ఉద్యోగం రావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలకు చిత్త శుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ లో పోలీస్ మెయిన్ పరీక్షలు జరిగితే ఆ తరువాత గ్రూప్ 1 మెయిన్స్ కూడా నిర్వహిస్తాం, ఆ వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షలు ఉన్నాయన్నారు. ఫిలిమినరీ, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించి మెయిన్స్ పరీక్షకు సిద్దమవుతూ ఉద్యోగ సాధనలో అడుగు దూరంలో నిలిచారన్నారు. అదే స్ఫూర్తితో కష్టపడి చదివి తల్లిదండ్రుల కండ్లల్లో అనందం చూడాలని మెయిన్స్ అభ్యర్థులకు సూచించారు. తుది దశ ట్రైనింగ్ కి రూ. 31లక్షలు ఖర్చు చేసి 450 మందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో సీపీ శ్వేత, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


Next Story