బీఆర్ఎస్ తోనే సమ సమాజం సాధ్యం.. మంత్రి హరీశ్ రావు

by Javid Pasha |
బీఆర్ఎస్ తోనే సమ సమాజం సాధ్యం.. మంత్రి హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: బీఆర్ ఎస్ పార్టీ తోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు క్రిస్మన్ కానుకలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను సమాన దృష్టితో అదరించే నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి అందరి పండగలకు బట్టలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుష్ట శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి సంక్షేమ ఫలాలను అందరికి అందించే నాయకుడికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు.


క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభువును కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ మేరకు క్రైస్తవ మత ప్రతినిధులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్మన్ రోజారాధ క్రిష్ణ శర్మ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మాజీ మున్సిపాల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం. సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Next Story