అగ్రికల్చర్ అధికారులపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

by Disha Web Desk |
అగ్రికల్చర్ అధికారులపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
X

దిశ, జహీరాబాద్: నియోజకవర్గంలోని జహీరాబాద్, మొగుడంపల్లి మండలకేంద్రంలో పలు విద్యాసంస్థలను ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, ఎంపీ బీబీ పాటిల్‌లతో కలిసి వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మొగుడంపల్లిలో రూ.4.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలతో పాటు మన్నపూర్, మొగుడంపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక ప్రారంభించారు. ప్రధాన రహదారి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్మించిన సీసీ రోడ్, డివైడర్, ఎస్సీ కమ్యూనిటీ భవనం, సీసీ రోడ్డు ప్రారంభం, మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ఎస్‌లో మన ఊరు-మనబడి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడిన ఆయన.. వారి వద్ద పంటల సాగు వివరాలు లేకపోవడంతో మంత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు క్లస్టర్ వారిగా అధికారులను నియమించినా ఎందుకు పనిచేయడం లేదన్నారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed