నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీష్ రావు..

by Disha Web Desk 19 |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీష్ రావు..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: నిరుద్యోగులకు మంత్రి తన్నీరు హరీష్ రావు శుభవార్త చెప్పారు. ఇటీవల గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సిద్దిపేట నియోజక వర్గ పరిధిలో ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోన్న వారికి ఉచిత శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9లోపు నిరుద్యోగులు అన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కానిస్టేబుల్, గ్రూప్ 2, టెట్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన మాదిరే శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని యువతి, యువకులు అవకాశన్ని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9030433459, 8555032916 ఫోన్ నెంబర్లలలో సంప్రదించాలని సూచించారు.


Next Story

Most Viewed