ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి..

by Kodari Anjali |

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వాటికి మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి..
X

దిశ, చేగుంట: ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వాటికి మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ అన్నారు. మంగళవారం చేగుంట మండలం వడియారంలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం మెదక్ జిల్లా మూడవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల ధరలు తగ్గించాలని నాణ్యమైన విత్తనాలు అందించాలని రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నకిలీ విత్తనాలు కల్తీ ఎరువుల విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు..

నకిలీ విత్తనాల వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే క్రాప్ బుకింగ్‌ను పూర్తిస్థాయిలో నిర్వహించి రైతులకు పంట విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, వివిధ గ్రామాల రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story