ఈ బడి బాగు పడేదెప్పుడు..?

by Disha Web Desk 12 |
ఈ బడి బాగు పడేదెప్పుడు..?
X

దిశ, వర్గల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మన ఊరు మన బడి అని కార్యక్రమం చేపట్టిన పాఠశాలల రూపురేఖలు మాత్రం మారడం లేదు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో మౌలిక వసతులు సౌకర్యాలు లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల చెరువుకు దగ్గరగా ఉండటంతో వర్షకాలంలో పాఠశాలలోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో పిల్లలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరుగుదొడ్లు సక్కగా లేవు

పాఠశాలలోని చిన్నారులకు, మూత్రం లేదా మలవిసర్జన వచ్చిన ఇక ఇంటికే పరుగు పెట్టాలి. ఈ పాఠశాలలో రెండు మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేక రిపేర్లు ఉండటం వల్ల వాటిని వినియోగించడం లేదు. మరుగుదొడ్లు లేక చిన్నారులతో పాటుగా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో స్కావెంజర్ లేకపోవడంతో పాఠశాల అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. కొన్ని రోజులు ఉపాధి హామీలో భాగంగా తాత్కాలిక స్కావెంజర్స్ నియమించిన్నప్పటికి వేతనాలు సమయానికి రాకపోవడంతో రావడం లేదు. పాఠశాలను ఎవరు శుభ్రం చేయకపోవడంతో అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయి

పూర్తికాని నూతన భవన నిర్మాణం

పాఠశాల ఆవరణలో రెండు గదుల నిర్మాణం ప్రారంభించి పది సంవత్సరాలు గడిచిన ఇంకా అలానే స్లాబ్ వరకు పూర్తి చేసి మధ్యలో వదిలేశారు. పాఠశాలలో వంట గది లేకపోవడంతో బడిలోని వరండా పై వంట చేస్తున్నారు. దీంతో అక్కడ వంట చేయడంతో పొగతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల పైకప్పు పెచ్చులు ఉడటంతో వర్షం వస్తే వరండాలోకి నీరు ఉరుస్తుంది. వర్షం వచ్చిన రోజు వంట చేయాలంటే ఇబ్బందిగా మారింది. పాఠశాల శిథిలావస్థకు చేరడంతో తరగతి గది కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఇక వర్షం వస్తే చాలు కిటికీల ద్వారా వర్షపు నీరు గదిలోకి వస్తుంది. ఇక మీదట అయిన ఉన్నత అధికారులు దీనిపై స్పందించి మజీద్ పల్లి ప్రాథమిక పాఠశాలను బాగు చేయాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed