- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Karate Kalyani : కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
దిశ, కొమురవెల్లి : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి, బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అన్నారు. మంగళవారం కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార విషయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఇంట్లో ఎవరూ లేని క్రమంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలు బయట తిరగాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని బాధాతత్వంతో తెలిపారు.
300 కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో మూడు కుటుంబాలలో ఉన్న ఒక యువకుడు అఘాయిత్యానికి పాల్పడితే దాన్ని ఎదురించే శక్తి మనకు లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి కుటుంబాన్ని పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి ఎన్నో హిందూ కుటుంబాలు వచ్చాయని అది వారు గ్రహించాలని అన్నారు. ఇన్ని కుటుంబాలు ఉన్న మనకు రక్షణ లేనప్పుడు ఈ ప్రభుత్వాలు మనకు ఎందుకని ఆమె ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. బంధువులు, గ్రామస్తుల పైన పోలీసులు అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు నాగరాజు, కరుణాకర్, బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.