భూ విక్రయాల్లో మోసాలకు పాల్పడితే పీడీ యాక్ట్.. డీఎస్పీ బాలాజీ

by Dishafeatures2 |
భూ విక్రయాల్లో మోసాలకు పాల్పడితే పీడీ యాక్ట్.. డీఎస్పీ బాలాజీ
X

దిశ, కంగ్టి: భూ విక్రయాల్లో మోసాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఖేడ్ డీఎస్పీ బాలాజీ హెచ్చరించారు. కంగ్టి మండల పరిధిలోని రాజారాం తండ చౌరస్తా లో గురవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ.. భూములు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూయజమానులు దళారులతో కుమ్మక్కై కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. నారాయణఖేడ్ లో తక్కువ ధరకే భూములొస్తున్నాయంటూ కొంతమంది దళారులు కావాలనే దుష్ప్రచారం నిర్వహించారని చెప్పారు. ఈ క్రమంలోనే తక్కువ ధరకు భూములిప్పుస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అవి చూసి హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ, పూణె, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి మోసపోతున్నారని తెలిపారు. భూములు కొనేటప్పుడు పాస్ బుక్ తో పాటు కాస్రా పహానీని చూడాలని సూచించారు. భూముల పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని, చట్టపరంగా శిక్షిస్తామని డీఎస్పీ బాలాజీ తెలిపారు.


Next Story

Most Viewed