- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
జూటాకొర్ సీఎం కేసీఆర్ : రాజనర్సింహ

దిశ, అందోల్: బీఆర్‌ఎస్ పార్టీని నమ్మి మరో సారి మోసపొవద్దని ...దేశంలోనే నంబర్ వన్ జూటాకొర్ సీఎం కేసీఆరేనని దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అందోలు మండలంలోని అల్మాయిపేట, చందంపేట్, సాయిబాన్‌పేట్, మాసానిపల్లి, కొండారెడ్డిపల్లి తండా, కొండారెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి, సంగుపేట గ్రామాలలో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో జరిగిన అభివద్ది, సంక్షేమాన్ని వివరిస్తూనే, రాబోయే కాంగ్రెస్ పాలనలో జరిగే అభివద్ది, ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని సంక్షేమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... కేసీఆర్‌ను నమ్మి తొమ్మిదేండ్లు అధికారాన్ని కట్టబెడితే దోపీడీ చేశారే తప్ప అభివృద్ది చేసిందేమి లేదన్నారు. ప్రజలను తన మాటాలతో నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్‌ను మించినోడు లేడన్నారు. గత తొమ్మిదేండ్లుగా కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దోపీడికి గురైందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, కల్వకుంట్ల కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా పాలనను కొనసాగించారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కొత్త రేషన్‌కార్డుల మాటే లేదని, ఉన్న కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూడా లేదన్నారు.
రైతులకు రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. గ్రామ గ్రామాన బెల్టుషాపులు ఏర్పాటు చేసి, కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖాల్లో రూ. 1.98 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బిస్వాల్ కమిటీ సూచించిన ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయలేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని 15 సార్లు పేపర్ లీకేజీలు జరిగిన సందర్బాలు లేవని, కేవలం మన రాష్ట్రంలోనే జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. సుమారు రాష్ట్రంలో 50 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక దినసరి కూలీలుగా మారడం బాధకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన కష్టాలన్నీ తీరుతాయన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ కండువాను కప్పి దామోదర్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసీ చైర్మన్ పద్మనాభరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు వెంకట్‌రెడ్డి, యశ్వంత్‌గౌడ్, ప్రవీణ్, ప్రీతంరెడ్డి, మల్లేశం, నర్సింహరావు, రాజశేఖర్‌రెడ్డి, అశోక్, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణ, శివశంకర్‌గౌడ్, శ్రీధర్, వినయ్‌గౌడ్‌తో పాటు తదితరులు ఉన్నారు.